ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 30, 2021 , 16:41:03

చెపాక్‌లో స్టోక్స్‌, ఆర్చర్‌, బర్స్న్‌ ప్రాక్టీస్‌ షురూ

చెపాక్‌లో స్టోక్స్‌, ఆర్చర్‌, బర్స్న్‌  ప్రాక్టీస్‌ షురూ

చెన్నై: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, రిజర్వ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌  ప్రాక్టీస్‌ ప్రారంభించారు.  ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు శనివారం చెపాక్‌ స్టేడియంలో  ఫస్ట్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులోని మిగతా ఆటగాళ్లకు రెండోసారి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌గా తేలింది.   

ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ ముగ్గురు పాల్గొనలేదు. బర్న్స్‌ భార్య ఇటీవల బిడ్డకు జన్మనివ్వడంతో అతడు లంక టూర్‌కు వెళ్లలేదు. లంక నుంచి నేరుగా చెన్నైకి వచ్చిన రూట్‌సేన ఇంకా క్వారంటైన్‌లోనే ఉంది. జట్టు కన్నా ముందు భారత్‌కు వచ్చిన ఈ ముగ్గురు మూడోసారి నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా రావడంతో శనివారం ప్రాక్టీస్‌ మొదలెట్టారు.  ఫిబ్రవరి 2 నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లాండ్‌ జట్టు శిక్షణ ప్రారంభించనుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. 


VIDEOS

logo