బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 22:30:30

ఐపీఎల్ గెలిచే అర్హ‌త ఆర్‌సీబీకి ఉంది: విరాట్ కోహ్లీ

ఐపీఎల్ గెలిచే అర్హ‌త ఆర్‌సీబీకి ఉంది:  విరాట్ కోహ్లీ

ఐపీఎల్ గెలిచే అర్హ‌త ఆర్‌సీబీకి ఉంది:  విరాట్ కోహ్లీ 

ముంబై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలిచే అర్హ‌త‌  రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ)కి ఉంద‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గ‌త 12 సీజ‌న్ల‌లో ఆర్‌సీబీ మూడు సార్లు ర‌న్న‌ర‌ప్‌తోనే సరిపెట్టుకున్న‌ది. ఇక లాక్‌డౌన్‌తో ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న విరాట్‌..గురువారం ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో  ముచ్చ‌టించాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఆసక్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ‘ఆర్‌సీబీ ప్ర‌తి ఏడాది స్టార్ ఆట‌గాళ్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. దీని వ‌ల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడూ భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈసారైనా గెలుస్తారంటూ ఫ్యాన్స్ అనుకోవ‌డం వ‌ల్ల ప్ర‌తి మ్యాచ్‌లో ఒత్తిడి నెల‌కొంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మేము మూడు ఫైన‌ల్స్ ఆడి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుని ఒక్క‌సారి టైటిల్ గెలువ‌లేక‌పోయాం. కానీ ఇప్పుడు ఇవ‌న్నీ అన‌స‌వ‌రం. నిజాయితీగా చెప్ప‌ద‌ల్చుకున్నాను ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిచే అర్హ‌త ఉంది. 2016లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో 113 ప‌రుగులు చేయ‌డం నా ఐపీఎల్ కెరీర్‌లో ఎప్ప‌టికి మ‌రిచిపోలేని ఇన్నింగ్స్‌. పంజాబ్‌తో మ్యాచ్‌లో నేను అనుకున్న రీతిలో బ్యాటింగ్ చేయ‌డాన్ని ఆస్వాదించాను. ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన 2009-10 సీజ‌న్‌లో నీతో(పీట‌ర్స‌న్‌)తో పాటు క‌లిస్‌, బౌచ‌ర్‌, అనిల్ భాయ్‌, రాబిన్‌ తో క‌లిసి ఆర్‌సీబీకి ఆడ‌టం నాకు చిర‌కాలం గుర్తుంటుంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్‌ను బీసీసీఐ ఈనెల 15 వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. logo