మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 13:58:55

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ముంబై vs బెంగళూరు?

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ముంబై vs బెంగళూరు?

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 షెడ్యూల్‌ విడుదల  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది కరోనా బారినపడడం నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది.  

గతేడాది ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో  చెన్నై  టీమ్‌ ఈ ఏడాది ఆరంభ   మ్యాచ్‌ ఆడాలి. కరోనా కేసులు రావడంతో క్వారంటైన్‌లో ఉండటంతో  చెన్నై  టీమ్‌  ఇంకా ప్రాక్టీస్‌ మొదలుపెట్టలేదు. ధోనీ సారథ్యంలోని చెన్నై ఆటగాళ్లు సాధన చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై స్థానంలో మరో టీమ్‌కు అవకాశం ఇవ్వనున్నారు.

షెడ్యూల్‌లో తొలి  మ్యాచ్‌ నుంచి చెన్నై టీమ్‌ను తప్పించి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు ఛాన్స్‌ ఇస్తారని తెలుస్తున్నది. మొదటి మ్యాచ్‌లో మైదానంలో స్టార్‌ ఆటగాళ్లతో లీగ్‌ ఆరంభించాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ముంబై, చెన్నై తర్వాత  బెంగళూరు టీమ్‌కే అభిమానుల్లో క్రేజ్‌ ఎక్కువ.  చెన్నై కెప్టెన్‌  ధోనీ లేకపోతే  విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టును తొలి మ్యాచ్‌కు ఎంపిక చేయాలనుకుంటున్నారు. 


logo