శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 09, 2020 , 14:27:13

కోహ్లీసేనకు మళ్లీ జరిమానా

కోహ్లీసేనకు మళ్లీ జరిమానా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో  మందకొడిగా బౌలింగ్‌ చేసినందుకు టీమ్‌ఇండియాకు ఐసీసీ జరిమానా విధించింది.   మంగళవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్‌ జట్టు 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కోహ్లీసేన మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా విధించారు.  నిర్ణీత సమయంలో భారత్‌ ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ రెఫరీ విధించిన ఫైన్‌ను అంగీకరించాడు.  ఆసీస్‌ టూర్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్‌  జరిమానాకు గురవడం ఇది రెండోసారి.    సిరీస్‌ తొలి వన్డేలోనూ టీమ్‌ఇండియాకు మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా వేసిన విషయం తెలిసిందే.  logo