శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 07, 2021 , 00:26:02

కోహ్లీకి చిక్కులు!

కోహ్లీకి చిక్కులు!

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల చిక్కుల్లో పడే ప్రమాదం వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)లో కోహ్లీ పెట్టుబడి పెట్టగా.. ఆ సంస్థ నవంబర్‌లో టీమ్‌ఇండియా కిట్‌స్పాన్సర్‌గా ఎంపికైంది. తాజాగా ఎంపీఎల్‌కు చెందిన ఫన్‌వేర్‌ టెక్నాలజీస్‌ నుంచి రూ.33.32 లక్షలు విలువ చేసే కంపల్సరీ కన్వర్టబుల్‌ డెబెంచర్స్‌ (స్టాక్స్‌కు తప్పక మార్చుకోవాల్సిన బాండ్లు) కోహ్లీకి కేటాయింపులు జరిగాయి. దీంతో భారత్‌కు కెప్టెన్‌గా ఉంటూ.. జట్టుకు కిట్‌ స్పాన్సర్‌గా ఉన్న సంస్థ నుంచి వ్యాపార లబ్ధి పొందినందుకు కోహ్లీకి పరస్పర ప్రయోజనాల సెగ తగిలే అవకాశం ఉంది. logo