సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 22:37:18

‘ఆస్ట్రేలియా చాలా కష్టపడాలి’

‘ఆస్ట్రేలియా చాలా కష్టపడాలి’

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్​ఇండియా చాలా పటిష్టంగా కనిపిస్తున్నదని ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ మాథ్యూ వేడ్ అన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత జట్టుతో జరిగే టెస్టు సిరీస్​లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు. తాను ఇప్పటి వరకు ఆడిన జట్లలో విరాట్ నేతృత్వంలోని టీమ్​ఇండియా అత్యుత్తమమైనదని గురువారం ఓ ఇంటర్వ్యూలో వేడ్​ చెప్పాడు.

“భారత్​తో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియాకు చాలా కష్టతరమైనది. టీమ్​ఇండియా భీకరంగా ఉంది. నేను ఆడిన అత్యంత బలమైన జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్​ఇండియానే. అలాగే 2018 కంటే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగా ఉంది. బ్యాటింగ్​, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా తయారైంది. ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది” అని వేడ్ చెప్పాడు. కాగా భారత్​, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 3న ప్రారంభం కావాల్సి ఉంది. ఆడిలైడ్, మెల్​బోర్న్​, సిడ్నీ తదుపరి మూడు టెస్టులకు వేదికలుగా ఉన్నాయి.  


logo