గురువారం 13 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 17:24:05

పాక్‌పై విరాట్‌ కోహ్లీ 183 ఇన్నింగ్సే అత్యుత్తమం:గంభీర్‌

పాక్‌పై విరాట్‌ కోహ్లీ 183  ఇన్నింగ్సే అత్యుత్తమం:గంభీర్‌

న్యూఢిల్లీ:   2012 ఆసియాకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ సాధించిన 183 పరుగుల  ఇన్నింగ్స్‌  అత్యుత్తమమైనదిగా పరిగణించాడు  భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌. మూడు ఫార్మాట్లలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటని ప్రశంసించాడు.   

ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ కేవలం 148 బంతుల్లో 22ఫోర్లు, సిక్స్‌ సాయంతో 183 పరుగులు సాధించాడు.  దీంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 'మూడు ఫార్మాట్లలో కోహ్లీ నమ్మశక్యం కానీ ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. కానీ, అన్ని కోణాల్లోనూ  అతని గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది(183)  ఒకటిగా  నిలుస్తుందని' గంభీర్‌ అన్నాడు.

'330 లక్ష్యాన్ని ఛేదించాలి. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ (0/1)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో 330 పరుగుల ఛేధనలో 183 సాధించడం, అది కూడా పాకిస్థాన్‌పై చేయడం సాధారణ విషయం కాదు. అప్పుడు కోహ్లీకి అంత అనుభవం కూడా లేదని' ''బెస్ట్‌ ఆఫ్‌ ఆసియా కప్‌ వాచ్‌ ఎలాంగ్''‌ షోలో గౌతీ పేర్కొన్నాడు. నా దృష్టిలో 183 స్కోరు   కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌లో  ఇది ఒకటి అని గంభీర్‌  వ్యాఖ్యానించాడు. 


logo