శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 14, 2020 , 18:50:10

చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గం కదా!

చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గం కదా!

న్యూఢిల్లీ:  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ  సోషల్‌ మీడియాలో స్పందించాడు.  'ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై ధైర్యంగా పోరాడదాం. సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి..ముఖ్యంగా చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి' అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు.  భారత్‌-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు కావడంతో పాటు..ఐపీఎల్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విస్తరణ తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు  పౌరులూ అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. 


logo