మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 11, 2020 , 18:14:11

రేపు ఆస్ట్రేలియా వెళ్లనున్న కోహ్లీసేన

రేపు ఆస్ట్రేలియా వెళ్లనున్న కోహ్లీసేన

దుబాయ్:‌ ఐపీఎల్‌ 2020 సీజన్‌ మంగళవారంతో ముగిసింది. సుమారు 60 రోజుల పాటు ప్రత్యర్థులుగా తలపడిన ఆటగాళ్లు మరో రెండు నెలల పాటు ఒకే టీమ్‌ తరఫున ఆడాల్సి ఉంది.   నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనపై అందరి దృష్టి నెలకొలింది.  ఆసీస్‌ టూర్‌లో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో తలపడనుంది. 

నవంబర్‌ 12న విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరనుంది.  ఆటగాళ్లందరూ సిడ్నీ నగరంలో క్వారంటైన్‌లో ఉంటారు.  అక్కడే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆటగాళ్లు సాధన చేయనున్నారు.  కెప్టెన్‌ కోహ్లీతో పాటు పలువురు భారత క్రికెటర్లు  ఇప్పటికే టీమ్‌కు సంబంధించిన బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టారు.  ముంబై, ఢిల్లీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం చివరి బ్యాచ్‌ ఆటగాళ్లు జట్టుతో చేరారు.