మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 02, 2020 , 14:00:04

జ‌ర్న‌లిస్టుపై కోహ్లీ ఫైర్‌

జ‌ర్న‌లిస్టుపై కోహ్లీ ఫైర్‌

హైద‌రాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో తెలిసిందే.  బ్యాటింగ్‌లోనైనా.. ఫీల్డింగ్‌లోనైనా.. అత‌నెప్పుడూ దూకుడుమీదే ఉంటాడు. అయితే కివీస్‌తో జ‌రిగిన రెండ‌వ టెస్టులో.. విరాట్ కొంత శృతి మించాడు.  కివీస్ కెప్టెన్ విలియ‌మ్‌స‌న్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో మూడు ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ఆ స‌మ‌యంలో విరాట్ త‌న స‌హ‌జ‌సిద్ద‌మైన దూకుడు స్వ‌భావాన్ని ప్ర‌ద‌ర్శించాడు.  అభ్యంత‌ర‌క‌ర‌మైన సంకేతం ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది. రెండు టెస్టుల సిరీస్‌ను కోల్పోయిన త‌ర్వాత‌.. ఇవాళ కోహ్లీ మీడియా స‌మావేశం నిర్వ‌హించాడు. అక్క‌డ ఓ జ‌ర్న‌లిస్టు.. కోహ్లీని అత‌ని ప్ర‌వ‌ర్త‌న గురించి ప్ర‌శ్నించాడు.  విలియ‌మ్‌స‌న్ ప‌ట్ల అలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత వ‌ర‌కు సబ‌బు అని అడిగాడు. ఇండియ‌న్ కెప్టెన్‌గా ఆన్ ఫీల్డ్‌లో ఇలాగేనా ప్ర‌వ‌ర్తించ‌డం అని ప్ర‌శ్నించాడు. ఆ ప్ర‌శ్న వేసిన జ‌ర్న‌లిస్టుపై కోహ్లీ  ఫైర్ అయ్యాడు. నువ్వేమ‌నుకుంటున్నా వంటూ ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేశాడు. సగం విష‌యాలు తెలుసుకుని, సగం ప్ర‌శ్న‌ల‌తో రావ‌డం కాదు అని, వివాదం క్రియేట్ చేయాల‌ని మీర‌నుకుంటే, ఇది స‌రైన వేదిక కాద‌న్నాడు. ఆ విష‌యం గురించి మ్యాచ్ రెఫ‌రీతో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని కోహ్లీ మీడియాతో చెప్పాడు.  logo
>>>>>>