సౌథాంప్టన్: గ్రౌండ్లో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు మాత్రం మాంచి మూడ్‌లో కనిపించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ భాంగ్రా డ్యాన్స్ కూడా చేశాడు. గ్యాలరీలోని ఫ్యాన్స్ రిథమిక్‌గా డ్రమ్స్ వాయిస్తుంటే.. కోహ్లి అలా అలా డ్యాన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. మూడో రోజు రెండో సెషన్లో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత 9వ ఓవర్లో కోహ్లి ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ టైమ్‌కు విరాట్ అలా డ్యాన్సింగ్ మూడ్‌లో కనిపించినా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మాత్రం అతని మూడ్ మారిపోయే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియన్ టీమ్‌ను 217 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది.