శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 02, 2020 , 18:50:45

కోహ్లీ పుషప్స్‌ ఎలా చేస్తాడో తెలుసా.. వీడియో వైరల్‌

కోహ్లీ పుషప్స్‌ ఎలా చేస్తాడో తెలుసా.. వీడియో వైరల్‌

న్యూ ఢిల్లీ: ఈ కాలపు క్రికెటర్లలో అత్యంత ఫిట్‌నెస్‌గా ఉండే ఆటగాడు ఎవరూ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ. ఎప్పుడూ డిఫరెంట్‌గా వర్కవుట్స్‌ చేయడం అతడికి అలవాటు. కాగా, గురువారం విభిన్న రీతిలో పుషప్స్‌ చేస్తూ తీసిన వీడియోను అతడు ట్విట్టర్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. ఈ 20 సెకెండ్ల నిడివిగల వీడియోకు అతడు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ హార్దిక్‌పాండ్యాను ఉద్దేశిస్తూ ట్యాగ్‌లైన్‌ కూడా జోడించాడు. ‘హే హెచ్‌ @హార్దిక్‌పాండ్యా7 నువ్‌ చేసిన ఫ్లై పుషప్స్‌ నాకు నచ్చాయి. వాటికి నేను క్లాప్స్‌ను జోడించాను.’ అని వీడియోకు కొహ్లీ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo