ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 16:53:23

విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్‌

 విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్‌

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో స్పందించాడు.  భావోద్వేగ సందేశంతో పాటు జట్టు సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన గ్రూప్‌ ఫొటోను షేర్‌ చేశాడు.

'సీజన్‌లో  ఎత్తు పల్లాలు ఎదురైనా  సమిష్టిగా రాణించాం.  ఒక బృందంగా మాకు ఇదొక గొప్ప ప్రయాణం. మేం అనుకున్నట్లు ఫలితాలు రాలేదు. కానీ జట్టులోని సభ్యుల ప్రదర్శనపై గర్వంగా ఉంది. అభిమానులందరి అపూర్వ మద్దతుకు ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానులు మమ్మల్ని మరింత ధృఢంగా మారేలా చేస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం!' అంటూ కోహ్లీ ట్వీట్‌ చేశాడు.  

కీలక మ్యాచ్‌లో కోహ్లీ విఫలమవడంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీ వల్ల టీమ్‌ టైటిల్‌ గెలవలేకపోతోందని, జట్టు సారథిగా తప్పుకోవాలని బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు.  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన   విరాట్‌ కోహ్లీ (6) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. 

తాజావార్తలు