బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 13:53:02

మ‌రో మూడేళ్లు అన్ని ఫార్మాట్లు ఆడుతా : విరాట్ కోహ్లీ

మ‌రో మూడేళ్లు అన్ని ఫార్మాట్లు ఆడుతా :  విరాట్ కోహ్లీ

హైద‌రాబాద్‌: ఇండియ‌న్ టీమ్‌లో విరాట్ కోహ్లీ పాత్ర తెలిసిందే.  టెస్టు, వ‌న్డే, టీ20 మ్యాచ్ ఏదైనా.. కోహ్లీ దూకుడుకు బ్రేక్ ఉండ‌దు. గ‌త కొన్నేళ్ల నుంచి విరాట్‌.. టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తూనే ఉన్నాడు.  కెప్టెన్‌గా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నాడు.  ఎంత వ‌త్తిడి ఉన్నా.. బిజీబిజీ క్రికెట్ షెడ్యూల్ ఉన్నా.. త‌న‌దైన శైలిలో రాణిస్తూనే ఉన్నాడు.  అయితే మ‌రో మూడేళ్ల పాటు కూడా అన్ని ఫార్మాట్ల‌లో ఆడ‌నున్న‌ట్లు విరాట్ స్ప‌ష్టం చేశాడు. వెల్లింగ్ట‌న్‌లో మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌కు కోహ్లీ స‌మాధానం ఇచ్చాడు. మూడేళ్ల త‌ర్వాత ఏవైనా రెండు ఫార్మాట్ల‌లో ఆడ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు.  కోహ్లీ ఇప్ప‌టికే 84 టెస్టులు, 248 వ‌న్డేలు, 82 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 12457, 11867, 2794 ర‌న్స్ చేశాడు. 2021 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఏదైనా ఫార్మాట్‌కు దూరం అవుతారా అని అడిగిన ప్ర‌శ్న‌కు కోహ్లీ బదులిస్తూ.. మరో మూడేళ్ల వ‌ర‌కు అన్ని ఫార్మాట్ల‌లో ఆడ‌నున్న‌ట్లు క్లారిటీ ఇచ్చాడు. శుక్ర‌వారం నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.
logo
>>>>>>