సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 00:04:33

కాస్త భయపడ్డా: కోహ్లీ

కాస్త భయపడ్డా: కోహ్లీ

  దుబాయ్‌: సుదీర్ఘ విరామం తర్వాత నెట్‌ప్రాక్టీస్‌కు ముందు కాస్త భయపడినట్లు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. మొత్తానికి తొలిరోజు తాను ఊహించిన దానికంటే మెరుగ్గానే శిక్షణ సాగిందని పేర్కొన్నాడు. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఐదు నెలలుగా ఇంటికే పరిమితమైన ప్లేయర్లు యూఏఈ వేదికగా జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం సిద్ధమవుతున్నారు. క్వారంటైన్‌ ముగించుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆదివారం నెట్స్‌లో చెమటోడ్చింది. ప్రాక్టీస్‌ సెషన్‌తో పాటు కోహ్లీ అనుభవాలను ఆ జట్టు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘నేను ఊహించినదని కంటే ప్రాక్టీస్‌ బాగానే సాగింది. ఐదు నెలల నుంచి బ్యాట్‌ పట్టుకోకపోవడంతో ముందు కాస్త భయమేసినా.. ఆ తర్వాత సాఫీగానే సాగింది’ అని విరాట్‌ అన్నాడు. 


logo