సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 00:19:49

సచిన్‌ను అందుకే భుజానెత్తుకున్నాం: కోహ్లీ

సచిన్‌ను అందుకే భుజానెత్తుకున్నాం: కోహ్లీ

న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన తర్వాత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకోవడం వెనుక ఉన్న కారణాన్ని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. వాంఖడే మైదానంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. అనంతరం సంబురాల్లో భాగంగా జట్టు సభ్యులంతా సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని మైదానమంతా కలియదిరిగారు. ‘ఆ క్షణంలో ఎంత ఉద్వేగంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. ప్రపంచకప్‌ సొంతం చేసుకున్న ఉత్సాహంలో పాజీ (సచిన్‌)కి తగిన గౌరవం ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే అదే సచిన్‌ చివరి ప్రపంచకప్‌ అని అందరికీ తెలుసు. దేశం కోసం మాస్టర్‌ ఎంతో చేశాడు. ఎన్నో ఏండ్లుగా జట్టు భారాన్ని భుజస్కంధాలపై మోశాడు. మా అందరి మార్గనిర్దేశకుడు, స్ఫూర్తి అతడే. అందుకే సొంత మైదానంలో భుజాలపై ఊరేగించాం’ అని కోహ్లీ ఓ చాట్‌ షోలో పేర్కొన్నాడు.logo