బుధవారం 27 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 12:01:04

కోహ్లీ.. బెంగ‌ళూరు టీమ్‌లో నాకు చోటిస్తావా?

కోహ్లీ.. బెంగ‌ళూరు టీమ్‌లో నాకు చోటిస్తావా?

లండ‌న్‌: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌, ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ ప్లేయ‌ర్ అయిన హ్యారీ కేన్‌.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓ రిక్వెస్ట్ పంపించాడు. నీ ఐపీఎల్ టీమ్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులో నాకు చోటిస్తావా అని కేన్ ట్వీట్ చేశాడు. ఈ టోటెన్‌హామ్ ప్లేయ‌ర్ టెన్నిస్ బాల్‌తో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. నాలో టీ20 విన్నింగ్ బ్యాట్స్‌మన్ ఉన్నాడ‌ని అనుకుంటున్నాను. కోహ్లి వ‌చ్చే సీజ‌న్‌లో ఆర్సీబీ టీమ్‌లో చోటు క‌ల్పిస్తావా అని కేన్ ట్వీట్ చేశాడు.

దీనికి కోహ్లి కూడా వెంట‌నే రిప్లై ఇచ్చాడు. చాలా బాగా ఆడుతున్నావు. కౌంట‌ర్ అటాకింగ్ బ్యాట్స్‌మ‌న్‌గా నా టీమ్‌లో చోటు ఇద్దామ‌నుకుంటున్నా అని కోహ్లి ట్వీట్ చేశాడు. 

ఇంత‌కుముందు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ కూడా కేన్ ట్వీట్‌పై స్పందించింది. నీ కోసం నంబ‌ర్ 10 జెర్సీని రిజ‌ర్వ్ చేసి పెడ‌తామ‌ని ఆర్సీబీ టీమ్ ట్వీట్ చేసింది. 


logo