శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 19, 2021 , 14:48:58

ఇదీ మా స‌త్తా: విరాట్ కోహ్లి

ఇదీ మా స‌త్తా: విరాట్ కోహ్లి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై ఇండియ‌న్ టీమ్ సాధించిన అపూర్వ విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. అడిలైడ్ టెస్ట్ త‌ర్వాత మా సామ‌ర్థ్యాన్ని అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఏం విజ‌య‌మిది. మా సామ‌ర్థ్యాన్ని శంకించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి. అత్య‌ద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌. ప్లేయ‌ర్స్ చూపించిన తెగువ‌, సంక‌ల్ప బ‌లం నిజంగా అద్భుతం. ఈ చారిత్ర‌క విజయాన్ని ఆస్వాదించండి అంటూ కోహ్లి ప్ర‌శంస‌లు కురిపించాడు. తొలి టెస్ట్ ఆడిన త‌ర్వాత పెట‌ర్నిటీ లీవ్‌పై ఇండియాకు తిరిగొచ్చేసిన కోహ్లి.. త‌న ట్వీట్ల‌తో టీమ్‌లో ఉత్సాహం నింపుతున్నాడు. 

VIDEOS

logo