మానసికంగా కుంగిపోయా

- ఒంటరిననే భావన వేధించింది: కోహ్లీ
న్యూఢిల్లీ: 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైనప్పుడు మానసిక క్షోభకు గురయ్యానని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సమూహంలో ఉన్నా ప్రపంచంలో అత్యంత ఒంటరి వ్యక్తిగా తనను తాను భావించుకొని కుంగిపోయానని చెప్పాడు. ఇంగ్లం డ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్‌తో ఓ పోడ్కాస్ట్ సందర్భంగా.. తాను మానసిక కుంగుబాటుతో పోరాడిన సందర్భాలను కోహ్లీ పంచుకున్నాడు.
‘సరిగా స్కోరు చేయలేకపోతున్నానని నిద్ర లేచినవెంటనే గుర్తు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతీ బ్యాట్స్‌మన్‌కు ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుందని అనుకుంటున్నా. దాని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియదు. అలాం టి సమయాన్ని నేను ఎదుర్కొన్నా. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వ్యక్తిగా ఫీలయ్యా’ అని కోహ్లీ చెప్పాడు. ఇలా మానసిక కుంగుబాటుకు గురైన సమయాల్లో కచ్చితంగా ప్రొఫెషనల్స్ సాయం తీసుకోవాలని కోహ్లీ సూచించాడు. తండ్రి మరణమే జీవితంలో తనను అత్యంత ప్రభావితం చేసిన సందర్భమని కోహ్లీ చెప్పాడు.
తాజావార్తలు
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ