ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 02, 2021 , 15:02:40

కోహ్లి మ‌రో సెంచ‌రీ చేస్తే వ‌ర‌ల్డ్ రికార్డ్‌

కోహ్లి మ‌రో సెంచ‌రీ చేస్తే వ‌ర‌ల్డ్ రికార్డ్‌

చెన్నై: ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. గ‌తేడాదిని ఒక్క సెంచ‌రీ కూడా లేకుండానే ముగించేశాడు. కొత్త ఏడాదిని అత‌డు సెంచ‌రీతో ప్రారంభించాల‌ని ప్ర‌తి ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్ కోరుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో జ‌ర‌గబోయే సిరీస్‌లోనే ఆ సెంచ‌రీ పూర్తి చేయాల‌ని ఆశిస్తున్నారు. అదే జ‌రిగితే విరాట్ కోహ్లి ఓ వ‌ర‌ల్డ్ రికార్డును క్రియేట్ చేస్తాడు. అది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు. ఇప్ప‌టి వ‌ర‌కూ పాంటింగ్ 41 సెంచ‌రీల‌తో టాప్‌లో ఉన్నాడు. ఇప్పుడు అత‌డితో స‌మానంగా ఉన్న కోహ్లి.. మ‌రో సెంచ‌రీ చేస్తే 42 సెంచ‌రీల‌తో రికార్డు సృష్టిస్తాడు. ఇంగ్లండ్‌తో టీమిండియా మొత్తం నాలుగు టెస్ట్‌లు ఆడ‌నుండగా.. శుక్ర‌వారం నుంచి మొద‌టి టెస్ట్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo