శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 12:22:50

ఆండర్సన్‌కు అభినందనలు:విరాట్‌ కోహ్లీ

ఆండర్సన్‌కు అభినందనలు:విరాట్‌ కోహ్లీ

దుబాయ్‌: ఇంగ్లాండ్‌ సీనియర్‌ బౌలర్‌   జేమ్స్‌ ఆండర్సన్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 600 వికెట్లు పడగొట్టిన  ఏకైక పేసర్‌గా    రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.  అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించిన  ఆండర్సన్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌ వేదికలో ప్రశంసలు కురిపించాడు.  600 వికెట్లు సాధించిన ఆండర్సన్‌కు అభినందనలు. నేను ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో కచ్చితంగా జిమ్మీ ఒకరు అని  విరాట్‌ ట్వీట్‌ చేశాడు.  2014 ఇంగ్లాండ్‌ టూర్‌లో ఇంగ్లీష్‌ పేసర్‌ నాలుగు సార్లు కోహ్లీని ఔట్‌ చేశాడు. ఆ ఏడాది పర్యటనలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 


logo