మరో అరుదైన రికార్డు చేరువలో విరాట్ కోహ్లి

కాన్బెర్రా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరగబోయే మూడో వన్డేలోనూ అతడు ఈ రికార్డు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్ మరో 23 పరుగులు చేస్తే చాలు.. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైల్స్టోన్ అందుకున్న ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. ఒకవేళ కాన్బెర్రాలో జరిగే మూడో వన్డేలోనే కోహ్లి ఈ 23 పరుగులు చేస్తే.. తన 251వ వన్డే, 242వ ఇన్నింగ్స్‌లోనే 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్‌లు, 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఆ లెక్కన మాస్టర్ కంటే ఎంతో ముందుగానే విరాట్ ఈ మార్క్‌ను అందుకోనున్నాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వాళ్లలో కోహ్లి ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్‌తోపాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. ఇక కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ (9 సెంచరీలు) సరసన నిలుస్తాడు.
తాజావార్తలు
- ఫాలో అయిపోండి..లేకపోతే వీరబాదుడే
- మా టీమ్‌తో జాగ్రత్త.. టీమిండియాకు పీటర్సన్ వార్నింగ్
- తెలంగాణకు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ల కేటాయింపు
- అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా