మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 10, 2020 , 21:56:18

పోలీసులకు కోహ్లీ, ఇషాంత్ సెల్యూట్​

పోలీసులకు కోహ్లీ, ఇషాంత్ సెల్యూట్​

న్యూఢిల్లీ:  కరోనా వైరస్​పై యుద్ధంలో అలుపెరుగని యోధుల్లా పని చేస్తున్న పోలీసులను టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసించారు. ఢిల్లీ పోలీసుల సేవలను కొనియాడుతూ ఇద్దరు స్టార్లు వీడియోలో సందేశాన్నిచ్చారు.

“సంక్లిష్ట సమయంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలకు సాయం చేస్తున్న పోలీసుల సేవలను చూస్తుంటే నాకు నమ్మకం పెరుగుతున్నది. ఢిల్లీ పోలీసులు నిజాయితీతో విధులు నిర్వర్తిండడంతో పాటు ప్రతిరోజూ పేదలకు ఆహారం అందజేస్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. చాలా బాగా పని చేస్తున్నారు. ఇదే అంకితభావంతో చర్యలను కొనసాగించండి” అని వీడియోలో కోహ్లీ పేర్కొన్నాడు.

“ఇది ఇంట్లో ఉండాల్సిన సమయం. మీతో పాటు మీరు ప్రేమించే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఢిల్లీ పోలీసులు పగలు, రాత్రి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండ్లలోనే ఉండి వారికి సహకరించండి. ముఖ్యంగా.. పుకార్లను నమ్మవద్దు. ఈ పోరులో మనం కచ్చితంగా గెలుస్తాం. జై హింద్​” అని ఇషాంత్ వీడియో సందేశంలో చెప్పాడు. ఈ వీడియోలను ఢిల్లీ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా పోలీసు శాఖ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. వీడియోల ద్వారా సందేశమిచ్చిన కోహ్లీ, ఇషాంత్​కు కృతజ్ఞతలు తెలిపింది. 


logo