బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 21, 2020 , 23:30:07

కోహ్లీనే నా ఫేవరెట్‌

 కోహ్లీనే నా ఫేవరెట్‌

కరాచీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో విరాటే తన ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌ అని, సాధించిన రికార్డులే అతడి గురించి  చెబుతాయని అన్నాడు. ప్రస్తుత భారత జట్టు స్థితిగతులను శనివారం తన యూట్యూబ్‌ చానెల్‌లో మియాందాద్‌ విశ్లేషించాడు. ‘టీమ్‌ఇండియాలో అత్యుత్తుమ ఆటగాడు ఎవరని అడిగితే.. నేను విరాట్‌ అని చెప్తా. అతడి గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు.. విరాట్‌ సాధించిన రికార్డులే చెబుతాయి. కోహ్లీ గతంలో దక్షిణాఫ్రికాలోనూ సెంచరీ సహా అద్భుతంగా ఆడాడు. అతడు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆడలేడు.. స్పిన్‌ను ఎదుర్కోలేడు అని ఎవరూ అనేందుకు లేదు’ అని మియాందాద్‌ చెప్పాడు. 


logo