ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 14:37:05

కోహ్లీ.. పాంటింగ్​లాగే: బ్రెట్ లీ

కోహ్లీ.. పాంటింగ్​లాగే: బ్రెట్ లీ

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్​ కెప్టెన్సీ మధ్య చాలా పోలికలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. ఇద్దరూ ఎంతో దూకుడుగా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో లీ అన్నాడు. జట్టు కోసం విరాట్ నిరంతరం తపిస్తాడని అన్నాడు.

"కెప్టెన్సీలో ప్రతి ఒక్కరికీ విభిన్నమైన స్టైల్ ఉంటుంsది. అయితే విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్​ కెప్టెన్సీని గమనిస్తే చాలా పోలికలు కనిపిస్తాయి. సారథ్యంలో ఇద్దరి శైలి ఒకేలా ఉంటుంది. ఇద్దరిలో సహజంగా దూకుడు కనిపిస్తుంది. నేను విరాట్ కెప్టెన్సీ చూడడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా. అతడు ఎంతో అంకితభావంతో, పట్టుదలతో ఉంటాడు. జట్టు కోసం రాణించాలని కోహ్లీ నిరంతరం తపన పడుతుంటాడు” అని బ్రెట్ లీ చెప్పాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా ప్రశంసలు పొందుతున్నాడు. కెప్టెన్సీలోనూ అదరగొడుతున్నాడు. అతడి సారథ్యంలోనే  ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తొలిసారి టెస్టు సిరీస్​(208-19)ను కైవసం చేసుకొని.. చరిత్ర సృష్టించింది.


logo