IPL – దుబాయ్: విరాట్ కోహ్లీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. చెన్నైతో శుక్రవారం జరిగిన IPL మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఆ మ్యాచ్ అయిదో ఓవర్లో Kohli ఓ భారీ సిక్స్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో.. కోహ్లీ కొట్టిన సిక్స్ ధాటికి.. బంతి షార్జా స్టేడియం బయటపడింది. ఆ సిక్సర్ 82 మీటర్ల దూరం ప్రయాణించింది. బ్యాట్ నుంచి వచ్చిన ఆ సౌండ్ వింటే తెలిసిపోతుంది.. ఇక ఆ బంతి ఎక్కడికి వెళ్తుందో చూడాల్సిన అవసరం లేదని కామెంటేటర్ సైమన్ డూల్ అన్నాడు. ఇక గవాస్కర్ ఆ షాట్‌కు కామెంట్రీ ఇస్తూ.. ఆ సౌండ్ వింటే బౌలర్లకు నిద్రపట్టదన్నాడు. అయితే చెన్నైతో మ్యాచ్‌లో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ మ్యాచ్‌ను బెంగుళూరు జట్టు ఓడిపోయింది. కానీ కోహ్లీ కొట్టిన సిక్సర్‌ను మాత్రం చూడాల్సిందే. దానికి సంబంధించిన వీడియో ఇదే. ఈ వీడియో వైరల్ అవుతోంది.