శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 18:24:01

విరాట్‌ కోహ్లీ..ఆ పరుగెందుకు? వీడియో వైరల్‌

విరాట్‌ కోహ్లీ..ఆ పరుగెందుకు? వీడియో వైరల్‌

దుబాయ్:‌  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో   రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు   8 వికెట్ల తేడాతో 39 బంతులు మిగిలి ఉండగానే   ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  కోల్‌కతా నిర్దేశించిన  85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌ ఔటైన తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మరో బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌ సింగ్‌తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. 

బెంగళూరు విజయానికి 3 పరుగులు అవసరమైన సమయంలో   ప్రసిధ్‌ కృష్ణ వేసిన 14 ఓవర్‌ మొదటి బంతికి కోహ్లీ రెండు రన్స్‌ రాబట్టగా   రెండో బంతికి పరుగు రాలేదు.  ఆర్‌సీబీ విజయానికి ఒక పరుగు అవసరం కాగా  మూడో బంతిని వికెట్‌ కీపర్‌ వైపు షాట్‌ ఆడి సింగిల్‌ పూర్తి చేశాడు కోహ్లీ. అకస్మాత్తుగా మళ్లీ రెండో పరుగు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్నించగా గుర్‌కీరత్‌ కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంకో పరుగు   పూర్తి చేశాడు.  సెకండ్‌ రన్‌ పూర్తి చేసిన తర్వాత కోహ్లీ చిరునవ్వు చిందించడం విశేషం. ఐతే రెండో పరుగును మాత్రం స్కోరు బుక్కులో నమోదు చేయరు.  కోహ్లీ సరదాగా తీసిన రన్‌పై అభిమానులు  సోషల్‌మీడియాలో తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. 

<