గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 24, 2020 , 21:56:25

బెంగళూరుకు షాక్‌.. 4 పరుగులకే 3 వికెట్లు

బెంగళూరుకు షాక్‌.. 4 పరుగులకే  3  వికెట్లు

దుబాయ్:  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు చేజార్చుకున్నది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బెంగళూరుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్(1)‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికే వెనుదిరిగాడు. కాట్రెల్‌ వేసిన నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడేందుకు పడిక్కల్‌ యత్నించగా బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకొని మిడాన్‌లో గాల్లోకి లేవడంతో రవి బిష్ణోయ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జోష్‌ ఫిలిప్‌  డకౌటయ్యాడు. షమీ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి జోష్‌ ఎల్బీడబ్లూగా పెవిలియన్‌ చేరాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(1) కూడా ఔటవడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కాట్రెల్‌ వేసిన మూడో ఓవర్‌ నాలుగో బంతిని పుల్‌ షాట్‌ ఆడిన కోహ్లీ..మిడాన్‌లో మళ్లీ రవి చేతికే చిక్కాడు. కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 

దీంతో బెంగళూరు 2.4 ఓవర్లలో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.  ప్రస్తుతం డివిలియర్స్‌(1), ఫించ్‌(7) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన  పంజాబ్‌  నిర్ణీత ఓవర్లలో  3 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(132 నాటౌట్‌: 69 బంతుల్లో 14ఫోర్లు, 7సిక్సర్లు)  అద్భుత సెంచరీతో చెలరేగాడు.