బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:07:25

విరాట్‌ కోహ్లీకి 12 లక్షల జరిమానా

విరాట్‌ కోహ్లీకి 12 లక్షల జరిమానా

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఈ సీజన్‌ కూడా కలిసి రావడం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో లీగ్‌లో శుభారంభం చేసిన కోహ్లీసేన.. పంజాబ్‌ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రత్యర్థికి దడపుట్టేలా హార్డ్‌హిట్టర్ల మేళవింపుతో కనిపించిన ఆర్‌సీబీ.. పంజాబ్‌ ముందు మోకరిల్లింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా భారీ ఓటమితో ఒత్తిడిలో ఉన్న ఆర్‌సీబీకి జరిమానా రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లోఓవర్‌ రేట్‌కు పాల్పడినందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 


logo