ఆదివారం 24 మే 2020
Sports - Feb 27, 2020 , 00:53:58

నాడు సచిన్‌.. నేడు కోహ్లీ

నాడు సచిన్‌.. నేడు కోహ్లీ

న్యూఢిల్లీ: క్రికెట్‌ అంటే సగటు భారత అభిమానిలాగే మెక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తన ఇష్టాన్ని చాటుకున్నాడు. అయితే క్రికెటర్ల అందరిలో ఎవరు ఇష్టమనే విషయంలో మాత్రం సత్య ఒకింత తడబడ్డాడనే చెప్పాలి. ఢిల్లీలో జరిగిన యంగ్‌ ఇన్నోవేటర్స్‌ సమ్మిట్‌లో సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ మహేశ్వరి అడిగిన ప్రశ్నకు ఆసక్తిగా బదులిచ్చాడు. సచిన్‌, కోహ్లీలో ఎవరు ఇష్టమన్న ప్రశ్నకు సత్య స్పందిస్తూ ‘మతాన్ని ఎంచుకోవడం లాగా ఉంది. నిన్న సచిన్‌ ఇష్టమైతే..నేడు కోహ్లీ’ అని సమాధానమిచ్చాడు. 


logo