గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 01, 2020 , 12:10:10

మరోసారి కోహ్లీ ఫ్లాప్..కష్టాల్లో భారత్‌

మరోసారి కోహ్లీ ఫ్లాప్..కష్టాల్లో భారత్‌

క్రైస్ట్‌చర్చ్‌:  న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(3), పృథ్వీ షా(14), విరాట్‌ కోహ్లీ(14) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. టెస్టు సిరీస్‌లో కోహ్లీ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. కివీస్‌ మీడియం పేసర్‌ గ్రాండ్‌హోం వేసిన ఇన్‌స్వింగర్‌కు కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. కివీస్‌ పర్యటనలో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన విరాట్‌ 11 ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. 

ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరున్న విరాట్‌ రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు మాత్రమే చేయడంతో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  పుజారా(17), రహానె(7) భారత ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. 26 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 68 పరుగులు చేసింది. రెండు టెస్టులో భారత్ ఆచితూచి ఆడుతోంది. అంతకుముందు భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ(4/81) ధాటికి కివీస్‌ 235 పరుగులకే కుప్పకూలింది.  logo