బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 16, 2021 , 14:41:53

ధోనీ రికార్డును స‌మం చేసిన విరాట్ కోహ్లి

ధోనీ రికార్డును స‌మం చేసిన విరాట్ కోహ్లి

చెన్నై: ఇంగ్లండ్‌పై సాధించిన భారీ విజ‌యంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో టెస్ట్ క్రికెట్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ పేరిట ఉన్న 21 విజ‌యాల రికార్డును కోహ్లి స‌మం చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో స్వ‌దేశంలో టీమిండియా సాధించిన 21వ విజ‌య‌మిది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 317 ప‌రుగుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. ఇది టీమ్ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ప‌రుగుల ప‌రంగా ఐదో అతి పెద్ద విజ‌యం. ఈ విజ‌యంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది.

ఎవ‌రి కెప్టెన్సీ ఎలా?

ధోనీ రికార్డును కోహ్లి స‌మం చేసినా.. అత‌ని కంటే రెండు మ్యాచ్‌లు ముందుగానే ఈ ఘ‌న‌త సాధించ‌డం విశేషం. ధోనీ ఇండియాలో 30 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. అందులో 21 విజ‌యాలు, 3 ఓట‌ములు, 6 డ్రాలు ఉన్నాయి. ఇక కోహ్లి 28 మ్యాచుల్లో కెప్టెన్‌గా ఉండ‌గా.. అందులో 21 విజ‌యాలు, 2 ఓట‌ములు, 5 డ్రాలు ఉన్నాయి. 


ఇవి కూడా చ‌ద‌వండి

డ‌బ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌.. రెండోస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

ఫింగర్ 5 ద‌గ్గ‌ర‌ జెట్టీ, హెలిప్యాడ్ కూల్చేసిన చైనా

'కూ'ని ఎంక‌రేజ్ చేస్తున్న ప్ర‌భుత్వం

VIDEOS

logo