అహ్మదాబాద్: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతున్నామంటే ఏదైనా రికార్డు గురించి చెబుతున్నట్లే. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకుంటున్న విరాట్.. ఏడాదికాలంగా తన స్థాయిలో ఫామ్‌లో లేడు. 2020లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌లో అయినా అతడు కచ్చితంగా చేస్తాడని అభిమానులు ఆశించినా.. అదీ జరగడం లేదు. తాజాగా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా కోహ్లి.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కొంత కాలంగా ధోనీ రికార్డులను వేటాడుతున్న విరాట్.. ఈ డకౌట్‌తో ధోనీ చెత్త రికార్డును సమం చేయడం విశేషం.
ఏంటా చెత్త రికార్డు?
విరాట్ కోహ్లికి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డకౌట్. గతంలో ధోనీ కూడా కెప్టెన్‌గా 8సార్లు డకౌటయ్యాడు. ఇప్పుడు కోహ్లి అతని రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లి డకౌట్ కావడం ఇది రెండోసారి. దీంతో అభిమానులు పాత గణాంకాలు తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పేస్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే కూడా కోహ్లి ఎక్కువసార్లు డకౌట్ కావడం విశేషం. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డకౌట్ కాగా.. విరాట్ 12సార్లు డకౌటయ్యాడు. టెస్టుల్లో ఇషాంత్ శర్మ 32 డకౌట్లతో టాప్‌లో ఉన్నాడు.