సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 14, 2021 , 17:33:42

ఈలలతో ప్రేక్షకులను ఎంకరేజ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ

ఈలలతో  ప్రేక్షకులను ఎంకరేజ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ

చెన్నై: చెపాక్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టుకు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. 50శాతం ప్రేక్షకులకు అనుమతినివ్వడంతో సుమారు 14వేల మంది మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. రెండో రోజు, ఆదివారం ఆటలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తనదైన స్టైల్‌తో అభిమానులను ఉత్సాహపరిచాడు. ఓవైపు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కడుతుండగా..విరాట్‌ విజిల్‌తో ఫ్యాన్స్‌ను ఎంకరేజ్‌ చేశాడు.

ఈలలతో ఉత్సాహపరచాలని చెన్నై ఫ్యాన్స్‌ను కోరాడు. 52 పరుగులకే సగం మంది ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ఔటవడంతో  కోహ్లీ సైతం మైదానంలోనే విజిల్‌ వేయడం విశేషం. మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ చేతులతో సైగచేస్తూ ప్రేక్షకులను గట్టిగా ఈలల వేయాలని కోరడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ కేరింతలు,  విజిళ్లతో మైదానం హోరెత్తింది.    

VIDEOS

logo