మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 22, 2021 , 12:55:52

కోహ్లి ఇంట్లో ప‌ని మ‌నిషి కూడా లేదు: మాజీ సెల‌క్ట‌ర్‌

కోహ్లి ఇంట్లో ప‌ని మ‌నిషి కూడా లేదు: మాజీ సెల‌క్ట‌ర్‌

ముంబై: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్ర‌శంస‌లు కురిపించాడు మాజీ సెల‌క్ట‌ర్ శ‌ర‌ణ్‌దీప్ సింగ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం అత‌నిద‌ని, చాలా నిరాడంబ‌రంగా ఉంటాడ‌ని అత‌డు చెప్పాడు. కోహ్లి, అత‌ని భార్య అనుష్క శ‌ర్మల సంప‌ద రూ.1200 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. ఈ ఇద్ద‌రూ ముంబైలో రూ.34 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయినా వాళ్ల ఇంట్లో ప‌ని మ‌నిషి లేద‌ని, ఇంటికి గెస్ట్‌లు ఎవ‌రు వ‌చ్చినా కోహ్లి, అనుష్క‌నే స్వ‌యంగా వాళ్ల‌కు అన్ని ప‌నులు చేసి పెడ‌తార‌ని శ‌ర‌ణ్‌దీప్ సింగ్ చెప్పాడు. 

ఫీల్డ్‌లో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. అత‌న్ని చూసిన చాలా మంది కోహ్లి ఎవ‌రి మాటా విన‌డు అని అనుకుంటారు. కానీ అత‌డు చాలా సింపుల్‌గా ఉంటాడు. టీమ్ సెల‌క్ష‌న్‌లోనూ అంద‌రు చెప్పింది శ్ర‌ద్ధ‌గా విని నిర్ణ‌యం తీసుకుంటాడు అని శ‌ర‌ణ్‌దీప్ తెలిపాడు. టీమ్‌లోని అంద‌రు ప్లేయ‌ర్స్‌కూ అత‌నంటే చాలా గౌర‌వ‌మ‌ని అన్నాడు. సాధార‌ణంగా సెల‌బ్రిటీల ఇళ్ల‌లో ప‌నివాళ్లు క‌చ్చితంగా ఉంటారు. అలాంటిది కోహ్లి ఇంట్లో ఎవ‌రూ లేకపోవ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లు శ‌ర‌ణ్‌దీప్ చెప్పాడు. 

VIDEOS

logo