బుధవారం 27 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 16:21:59

విరాట్‌ కోహ్లీ ఔట్‌..హెన్రిక్స్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌: వీడియో

విరాట్‌ కోహ్లీ ఔట్‌..హెన్రిక్స్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌: వీడియో

సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియా నిర్దేశించిన 390 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.  శతకం దిశగా సాగుతున్న  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(89: 87 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) 35 ఓవర్లో వెనుదిరిగాడు.   హేజిల్‌వుడ్‌ వేసిన ఐదో బంతిని షాట్‌ ఆడేందుకు యత్నించిన కోహ్లీ.. హెన్రిక్స్‌ చేతికి చిక్కాడు. కష్టతరమైన క్యాచ్‌ను హెన్రిక్స్‌   మెరుపు వేగంతో డైవ్‌ చేసి అందుకున్నాడు.  

భారీ లక్ష్య ఛేదనలో క్రీజులో కుదురుకున్న కోహ్లీ పెవిలియన్‌ చేరడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది.  కేఎల్‌ రాహుల్‌ నిలకడగా ఆడుతుండగా హార్దిక్‌ పాండ్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని భావిస్తున్నాడు. 38 ఓవర్లకు భారత్‌ 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. రాహుల్‌(46), హార్దిక్‌(9) క్రీజులో ఉన్నారు. కోహ్లీ ఔటవడంతో ఆసీస్‌ మ్యాచ్‌పై పట్టుసాధించింది. 


logo