శనివారం 16 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 15:52:46

కోహ్లీ వచ్చేస్తున్నాడు స్మిత్‌..!

కోహ్లీ వచ్చేస్తున్నాడు స్మిత్‌..!

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఆదివారం టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.   ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా నంబర్‌ వన్‌కు చేరువగా వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ 888 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  ఇప్పుడు కోహ్లీ.. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌  స్టీవ్‌ స్మిత్‌కు   సమీపంగా వచ్చాడు.  వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం 21గా ఉంది.   

స్మిత్‌  901 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా తొలి టెస్టులో స్మిత్‌(1, 1 నాటౌట్‌) రెండు ఇన్నింగ్స్‌లో విఫలమవగా..విరాట్‌ కోహ్లీ( 74, 4) తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో మెరిశాడు.   పేలవ ప్రదర్శన చేసిన   పుజారా ఒక ర్యాంకు కోల్పోయి  ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ ఒక ర్యాంకు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలువగా..బుమ్రా ఒక ర్యాంకు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. 

ఇవి కూడా చదవండి..

ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌డాగ్ ట్రాలీ ఏదో తెలుసా?

1,731 గ్రాముల చంద్రుడి మట్టి

అలర్జీ రోగులు తస్మాత్‌ జాగ్రత్త: యూఎస్‌ఎఫ్‌డీఏ