మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Jan 20, 2020 , 17:04:55

ధోనీ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ

ధోనీ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో 89 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. తృటిలో సెంచరీ కోల్పోయినప్పటికీ, అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకోల్పాడు.

బెంగళూరు: భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో 89 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. తృటిలో సెంచరీ కోల్పోయినప్పటికీ, అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకోల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఎం.ఎస్‌.ధోని పేరిట ఉంది. ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు సాధించగా, విరాట్‌ కేవలం 199 ఇన్నింగ్స్‌ల్లో 11,208 పరుగులు సాధించి ధోని రికార్డును అధిగమించాడు.

కాగా, ఓవరాల్‌గా కోహ్లి.. వన్డేల్లో 11,792 పరుగులు సాధించగా, టెస్టుల్లో 7,202 పరుగులు, టీ 20ల్లో 2,689 పరుగులు సాధించాడు. కోహ్లి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు, 104 అర్ధసెంచరీలు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న కోహ్లి.. అనేక రికార్డులు బద్దలు కొడుతూ.. అభిమానులను అలరిస్తున్నాడు.

అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్లు
విరాట్‌ కోహ్లి- 11,208 పరుగులు(199 ఇన్నింగ్స్‌ల్లో) 
ఎం.ఎస్‌.ధోని- 11,207 పరుగులు(330 ఇన్నింగ్స్‌ల్లో)
మహమ్మద్‌ అజారుద్దీన్‌-8,095 పరుగులు(230 ఇన్నింగ్స్‌ల్లో)
సౌరవ్‌ గంగూలీ- 7643 పరుగులు(217 ఇన్నింగ్స్‌ల్లో)


logo