మంగళవారం 26 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 19:26:06

కింగ్‌ కోహ్లీ@ 22,000

కింగ్‌ కోహ్లీ@ 22,000

సిడ్నీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఫామ్‌లో కనిపించిన  రన్‌మెషీన్‌ కోహ్లీ(89 87 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధసెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. గత ఆరు-ఏడేండ్ల నుంచి పరుగుల వరదపారిస్తూ వచ్చిన విరాట్‌ జట్టుకు ఎన్నో విజయాలన్నందించాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ సగటు 50కి పైనే కావడం విశేషం. 

ఆసీస్‌తో మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 86 పరుగులు పూర్తి చేయగానే ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో కోహ్లీ 22వేల పరుగుల మార్క్‌ను  చేరుకున్నాడు.  క్రికెట్‌ చరిత్రలో 22వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌ విరాటే కావడం విశేషం. 

ఇప్పటి వరకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(34,357 పరుగులు), కుమార సంగక్కర(28016), రికీ పాంటింగ్‌(27483), జయవర్ధనే(25957), జాక్వెస్‌ కలీస్‌(25534), రాహుల్‌ ద్రావిడ్‌(24208),  బ్రియాన్‌ లారా(22358) కోహ్లీ కన్నా ముందు ఫీట్‌ అందుకున్నారు.  కోహ్లీ ఇప్పటి వరకు 86 టెస్టులు(7240 పరుగులు), 250 వన్డేలు(11977), 81 టీ20(2794)లకు ప్రాతినిధ్యం వహించాడు. 


logo