శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 19:00:28

ది వన్ అండ్ ఓన్లీ.. విరాట్ కోహ్లీ

ది వన్ అండ్ ఓన్లీ.. విరాట్ కోహ్లీ

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారతీయుడిగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా అత్యధికంగా ఫాలోయింగ్ కలిగివున్న భారతీయురాలు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కోహ్లీని 5.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరిస్తున్న టాప్ -10 లో కోహ్లీ మాత్రమే ఉండటం విశేషం. లాక్‌డౌన్ సమయంలో ఆటగాళ్ల ఆదాయాల పరంగా కోహ్లీ ఆరో స్థానంలో ఉండగా.. రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. 

31 ఏండ్ల కోహ్లీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 1000 పోస్టులను పూర్తి చేయగా, అతడు 171 మందిని ఫాలో అవుతున్నారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో, లియోన్ మెస్సీ , నెయ్మార్ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరిస్తున్న నాల్గవ ఆటగాడుగా నిలిచారు. ఈ జాబితాలో బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. ఇటాలియన్ ఫుట్‌బాల్ క్లబ్ జువెంటస్ స్ట్రైకర్ రొనాల్డోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 232 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రెండవ స్థానంలో స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు చెందిన మెస్సీ ఉన్నారు. ఆయనకు 16.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు కలిగివున్న టాప్ 10 భారతీయులు

విరాట్ కోహ్లీ - 7 కోట్లు

ప్రియాంక చోప్రా - 5.50 కోట్లు

శ్రద్ధా కపూర్ - 5.14 కోట్లు

దీపికా పదుకొనే - 5.10 కోట్లు

అలియా భట్ - 4.80 కోట్లు

నరేంద్ర మోదీ - 4.59 కోట్లు

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - 4.30 కోట్లు

అక్షయ్ కుమార్ - 4.29 కోట్లు

నేహా కక్కర్ - 4.24 కోట్లు

కత్రినా కైఫ్ - 4.11 కోట్లు


logo