శనివారం 23 జనవరి 2021
Sports - Dec 07, 2020 , 13:52:44

కెప్టెన్‌గా కోహ్లి అరుదైన రికార్డు

కెప్టెన్‌గా కోహ్లి అరుదైన రికార్డు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా విజ‌యం త‌ర్వాత‌.. కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇది గ‌తంలో ఏ ఇత‌ర ఇండియ‌న్ కెప్టెన్‌కూ సాధ్యం కాని రికార్డు. ఆసీస్ గ‌డ్డ‌పై అన్ని ఫార్మాట్ల‌లో సిరీస్‌లు గెలిచిన ఏకైక భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఓవ‌రాల్‌గా చూసుకుంటే సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెస్సీ త‌ర్వాత రెండోస్థానంలో కోహ్లి ఉన్నాడు. కోహ్లి కెప్టెన్సీలో గ‌త పర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియాపై తొలిసారి టెస్ట్ సిరీస్‌తోపాటు వ‌న్డే సిరీస్‌ను కూడా గెలిచింది టీమిండియా. అయితే టీ20 సిరీస్ మాత్రం అప్పుడు 1-1తో స‌మ‌మైంది. ఇప్పుడు వ‌రుస‌గా రెండు టీ20లు గెల‌వ‌డం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో  మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమిండియా గెలుచుకుంది. ఈ విజ‌యంతో గ‌తంలో ఏ ఇండియ‌న్ కెప్టెన్‌కూ సాధ్యం కాని రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 


logo