సోమవారం 25 మే 2020
Sports - Mar 30, 2020 , 12:18:42

కరోనాపై పోరుకు కోహ్లీ, అనుష్క సాయం

కరోనాపై పోరుకు కోహ్లీ, అనుష్క సాయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్​పై పోరాటం కోసం టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్​ నటి అనుష్క శర్మ దంపతులు పీఎం-కేర్స్​ నిధి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో సోమవారం ప్రకటించిన కోహ్లీ.. ఎంత మొత్తం ఇచ్చారన్నది వెల్లడించలేదు. “పీఎం-కేర్స్ నిధి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి నేను, అనుష్క కొంత సాయం చేస్తున్నాం. చాలా మంది బాధపడుతుండడం(కరోనా వల్ల) మా హృదయాలను కలచివేస్తున్నది. కష్టాల్లో, బాధలో ఉన్న వారికి ఏదో విధంగా మా విరాళం సాయపడుతుందని ఆశిస్తున్నాం” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది సూచనలు పాటించాలని కోహ్లీ, అనుష్క ఇప్పటికే పలుసార్లు ట్విట్టర్​ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. logo