ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 22:15:19

మా న‌వ్వులు అబ‌ద్ధమేమో.. కానీ మేము కాదు: విరుష్క‌

మా న‌వ్వులు అబ‌ద్ధమేమో.. కానీ మేము కాదు: విరుష్క‌

మా న‌వ్వులు అబ‌ద్ధమేమో.. కానీ మేము కాదు: విరుష్క‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్ద‌వ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించ‌ని విరామాన్ని స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. సామాజిక మ‌ధ్య‌మాల్లో చురుకుగా ఉండే ఈ జంట త‌మ అభిమానుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ల‌క‌రిస్తూనే ఉంది. తాజాగా గురువారం ఈ జోడీ ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ న‌వ్వుతూ పోజిచ్చిన ఫొటోను అభిమానుల‌తో పంచుకున్న విరాట్‌.. `మా న‌వ్వులు న‌కిలీ కావొచ్చేమో కానీ, మేము కాదు`అని వ్యాఖ్య జోడించాడు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు త‌మ వంతు సాయంగా విరాళాన్ని ప్ర‌క‌టించిన ఈ జోడీ.. ప‌రిస్థితుల్లో త్వ‌ర‌గా మార్పు రావాల‌ని కోరుకుంటున్న‌ది. logo