శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 12:58:31

దేశానికి బ‌ల‌మ‌వుదాం.. కోహ్లి, ర‌హానే రిప‌బ్లిక్ డే విషెస్‌

దేశానికి బ‌ల‌మ‌వుదాం.. కోహ్లి, ర‌హానే రిప‌బ్లిక్ డే విషెస్‌

ముంబై: ఇండియ‌న్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, అజింక్య ర‌హానే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా దేశానికి బ‌ల‌మ‌వుదాం అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. మ‌నం ఈ రోజు ఏం చేస్తున్నామ‌న్న దానిపైనే భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న దేశానిని మ‌నం బ‌ల‌మ‌వుదాం. మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర‌డానికి సాయం చేద్దాం. ప్ర‌తి ఒక్క‌రికీ రిప‌బ్లిక్ డే శుభాకాంక్ష‌లు, జైహింద్ అని కోహ్లి ట్వీట్ చేశాడు. అటు ర‌హానే కూడా వెరీ హ్యాపీ రిప‌బ్లిక్ డే అని ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ టెస్ట్ గెలిచిన త‌ర్వాత త్రివ‌ర్ణ ప‌తాకం ప‌ట్టుకొని గ్రౌండ్‌లో తిరుగుతున్న టీమిండియా ఫొటోను ర‌హానే షేర్ చేశాడు. వీళ్లే కాకుండా స‌చిన్‌, ల‌క్ష్మ‌ణ్, సెహ్వాగ్‌లాంటి మాజీలు కూడా రిప‌బ్లిక్ డే శుభాకాంక్ష‌లు చెప్పారు. అటు సైనా నెహ్వాల్‌, బైచుంగ్ భూటియాలాంటి ఇత‌ర క్రీడాకారులు కూడా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విషెస్ చెప్పారు. 

VIDEOS

logo