గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 30, 2020 , 16:09:18

IPL 2020: కోహ్లీసేన ఆట పాటలు వీడియో చూశారా?

IPL 2020: కోహ్లీసేన  ఆట పాటలు  వీడియో చూశారా?

దుబాయ్: సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీ  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో  నూతనోత్తేజాన్ని  నింపింది.  ఈ గెలుపును  విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది  బాగానే ఆస్వాదిస్తున్నారు.    ఆటగాళ్లు  రెండు  టీమ్‌లుగా విడిపోయి  పూల్‌ వాలీబాల్‌ ఆడారు. ఆ తర్వాత  పాటలు, డ్యాన్స్‌లతో   సంతోషంగా గడిపారు. 

కోహ్లీ, చాహల్‌, పార్థీవ్‌ పటేల్‌, సైనీ పాటలు పాడగా ఆఖర్లో విరాట్‌ స్టెప్పులు కూడా వేసి అలరించాడు.   ఆటగాళ్లు  గెలుపును ఎంజాయ్‌ చేస్తుండగా తీసిన వీడియోను ఫ్రాంచైజీ ట్విటర్లో పోస్ట్‌ చేసింది.  బెంగళూరు జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో   అక్టోబర్‌ మూడో తేదీన  అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.