శనివారం 16 జనవరి 2021
Sports - Dec 09, 2020 , 00:26:50

6 లక్షల మందికి నచ్చిందట విరుష్క ట్వీట్‌ రికార్డు

6 లక్షల మందికి నచ్చిందట విరుష్క ట్వీట్‌ రికార్డు

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. మేమిద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ ఆగస్టులో విరుష్క చేసిన ట్వీట్‌ ట్విట్టర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక మంది (6.44 లక్షలు) లైక్‌ చేసిన ట్వీట్‌గా రికార్డుల్లోకెక్కింది. మరోవైపు తన ఫ్యాన్స్‌తో తమిళ సూపర్‌ స్టార్‌   విజయ్‌ దిగిన సెల్ఫీ ఫొటో.. అత్యధిక రీట్వీట్లు(1.61 లక్షలు) చేసిన ట్వీట్‌గా నిలిచింది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దీపాలు వెలిగించడం, రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్‌ ధోనీని పొగుడుతూ మోదీ  రాసిన లేఖ, కరోనా కారణంగా ప్రభావితమైన వారికి రతన్‌ టాటా మద్దతు..ట్విట్టర్‌లో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.