బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 20, 2020 , 23:48:43

మేము ఇంట్లోనే.. మరి మీరు?

మేము ఇంట్లోనే.. మరి మీరు?

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇండ్లకే పరిమితమై స్వీయ నిర్బంధం విధించుకోవడం మంచిదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు పిలుపునిచ్చారు. భార్య అనుష్క శర్మతో కలిసి రూపొందించిన వీడియోలో క్లిష్టపరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోహ్లీ చర్చించాడు. ‘ప్రస్తుతం మనమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. వైరస్‌వ్యాప్తి ఆగాలంటే ప్రజలంతా సమిష్ఠిగా కృషిచేయాల్సిన అవసరముంది. మేమిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇండ్లలోనే ఉంటే మంచిది’ అని ఈ జంట పేర్కొంది. 


logo
>>>>>>