ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 00:58:35

విరుష్క ఆనందోత్సాహం

విరుష్క ఆనందోత్సాహం

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను ట్విట్టర్‌ వేదికగా కోహ్లీ గురువారం వెల్లడించాడు. వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా తాము ముగ్గురం కాబోతున్నామంటూ అనుష్కతో కలిసి ఇటీవల దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. ‘2021 కల్లా మేం ముగ్గురం కాబోతున్నాం’ అని రాసుకొచ్చాడు. దీంతో విరుష్క జోడీకి క్రికెట్‌, బాలీవుడ్‌ స్టార్లు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ గత వారమే యూఏఈకి వెళ్లాడు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జరుగనున్న టోర్నీ కోసం సిద్ధమవుతున్నాడు. కాగా 2013 నుంచి ప్రేమలో మునిగితేలిన విరాట్‌, అనుష్క 2017 డిసెంబర్‌లో ఇటలీ వేదికగా పెండ్లి చేసుకొని ఒక్కటైన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఈ ఏడాది మార్చి నుంచి విరుష్క జోడీ ఇంటికే పరిమితమైంది. సరదా వీడియోలు చేస్తూ ఇద్దరూ అభిమానులను అలరించారు. అలాగే ప్రజలకు వైరస్‌ పట్ల అవగాహన సైతం కల్పించారు.


logo