శనివారం 28 మార్చి 2020
Sports - Jan 28, 2020 , 16:20:52

విరాట్‌ కోహ్లీ ఇంకో 25 పరుగులు చేస్తే..

విరాట్‌ కోహ్లీ ఇంకో 25 పరుగులు చేస్తే..

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు.

హామిల్టన్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న  విరాట్‌ జోరుకు ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి.  న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు.   భారత్‌ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ పేరిట ఉంది.  ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో  సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1,273), న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలయమ్సన్‌(1148), మహేంద్రసింగ్‌ ధోనీ(1,112)లు విరాట్‌ కన్నా ముందున్నారు. బుధవారం కివీస్‌తో జరిగే మూడో టీ20లో కనీసం 25 రన్స్‌ చేస్తే ధోనీని..విరాట్‌ అధిగమించి ఓవరాల్‌ జాబితాలో మూడో స్థానానికి చేరుకుంటాడు.  

టీ20ల్లో  50కి పైగా పరుగులను 8 సార్లు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో డుప్లెసిస్‌, విలియమ్సన్‌తో కలిసి కోహ్లీ  సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కోహ్లీ ఇంకో 50+స్కోరు సాధిస్తే  ఆ ఇద్దరిని అధిగమించి అత్యధిక సార్లు యాభైకి పైగా పరుగులు చేసిన కెప్టెన్‌గా   నిలుస్తాడు. కోహ్లీని మరో  అద్భుతమై రికార్డు కూడా ఊరిస్తోంది.   టీ20ల్లో 50 సిక్సర్లు బాదిన రెండో కెప్టెన్‌గా అవతరించడానికి విరాట్‌  మరో 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు.  


logo