బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 14:11:00

పింక్‌ బాల్ టెస్ట్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించేనా..?

పింక్‌ బాల్ టెస్ట్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించేనా..?

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మూడో మ్యాచ్ బుధవారం నుంచి అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే.. ప్రపంచంలో మూడో బ్యాట్స్‌మన్‌గా, పింక్ బాల్ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నారు. 2019 లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అసద్ షఫీక్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషెన్ ముందంజలో ఉన్నారు. షఫీక్, లబుషెన్ ఇద్దరూ నాలుగు డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడి చెరో 2 సెంచరీలు సాధించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరో 16 మంది బ్యాట్స్‌మెన్లు ఒక్కో సెంచరీ చేశారు.

 కాగా, అత్యధిక డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అందుకే సెంచరీల సంఖ్యలో కూడా ఈ జట్టు బ్యాట్స్‌మెన్ ముందున్నారు. ఆస్ట్రేలియా జట్టు 8 డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టు తరఫున 7 సెంచరీలు నమోదయ్యాయి. ఈ వరుసలో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉన్నది. పాకిస్తాన్ జట్టు 4 పింక్ బాల్ టెస్టులు ఆడగా.. ఆ జట్టు ఆటగాళ్లు 4 సెంచరీలు సాధించారు. మూడోస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 2 టెస్టులు ఆడగా.. ఆ జట్టు ఆటగాళ్లు 3 సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు మూడు మ్యాచులు ఆడగా.. ఆయా జట్ల ఆటగాళ్లు రెండు చొప్పున సెంచరీలు నమోదుచేశారు. ఇకపోతే, భారత్‌ రెండు మ్యాచుల్లో ఒకటి, శ్రీలంక, వెస్టిండిస్‌ జట్లు 3 మ్యాచులు ఆడగా.. ఆయ జట్ల ఆటగాళ్లు ఒక్కొక్కటి చొప్పున సెంచరీలు చేశారు.

2 సెంచరీలు చేయని కెప్టెన్లు

డే-నైట్ టెస్ట్ మ్యాచుల్లో ఇంతవరకు ఏ కెప్టెన్ కూడా రెండు సెంచరీలు నమోదు చేయలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి కెప్టెన్‌గా నిలువనున్నాడు. ఇప్పటివరకు ఐదుగురు బ్యాట్స్‌మెన్లు కెప్టెన్లుగా డే-నైట్ టెస్ట్ మ్యాచుల్లో ఒక్కో సెంచరీ సాధించారు. విరాట్‌తో పాటు డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) ఉన్నారు. డే-అండ్‌ నైట్‌ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేయడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ముందంజలో ఉన్నారు. వార్నర్ 6 పింక్ బాల్ టెస్ట్ మ్యాచుల్లో 59.60 సగటుతో 596 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 7 టెస్టుల్లో 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన లబుషెన్ మూడవ స్థానంలో ఉన్నాడు. లబుషెన్‌ 4 టెస్టుల్లో 81.50 సగటుతో 489 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఈ జాబితాలో 12 వ స్థానంలో ఉన్నారు. కోహ్లీ 2 మ్యాచ్‌ల్లో 214 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి..

వైర్లు లేకుండానే న్యూజిలాండ్‌లో విద్యుత్‌ సరఫరా..!

తొలిసారిగా అమలులోకి వచ్చిన ఐఎస్‌ఓ ధ్రువీకరణ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo